What is SGX Nifty ? SGX నిఫ్టీ అంటే ఏంటి?SGX Nifty Explained

What is SGX Nifty ? SGX నిఫ్టీ అంటే ఏంటి?

ఈరోజు మనం SGX నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం.ఉదయం మార్కెట్స్ ఓపెన్ అవ్వడానికి ముందు CNBC లాంటి న్యూస్ ఛానల్స్ SGX NIFTY గురించి మాట్లాడుతుంటారు. మనం కూడా ఉదయం లేవగానే SGX NIFTY నీ చూసి మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయో అని అంచనా వేస్తాం.

SGX Nifty

ఉదాహరణకు: ఒకవేళ SGX NIFTY పాజిటివ్ లో ఉంటే ఆరోజు మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అవుతుంది అని అర్థం.

SGX Nifty

అలా కాకుండా SGX NIFTY నెగిటివ్ లో ఉంటే ఆరోజు మార్కెట్స్ నెగిటివ్ లో ఓపెన్ అవుతున్నాయి అని అర్థం.

SGX NIFTY

అసలు ఈ SGX NIFTY అంటే ఏమిటి దానికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది.SGX NIFTY ను ఎక్కడ చూడాలి దానితో మనం ట్రేడ్ చేయగలమా అనే విషయాలు మనం కింద మాట్లాడుకుందాం.

 

SGX NIFTY అంటే సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అర్థం. నిఫ్టీ కి సంబంధించి ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈ SGX NIFTY లో ట్రేడ్ అవుతాయి.

ఇది ఇలా ఉంటే ఇండియాలో ఉండే నిఫ్టీ కాంట్రాక్ట్స్ కి SGX లో ఉండే నిఫ్టీ కాంట్రాక్ట్స్ కి చాలా తేడా ఉంటుంది.

ఇండియాలో నిఫ్టీకి 1 LOT కీ 50 షేర్స్ ఉంటాయి. SGX nifty లోLOTS బట్టి కాదు యూఎస్ డాలర్ బట్టి ఉంటుంది. SGX NIFTY లో ఎలా ఉంటుంది అంటే CMP(CURENT MARKET PRICE)*2USD అంటే…

ఉదాహరణకు: SGX NIFTY ఒక రోజులో 100 పాయింట్లు పెరిగితే 100*2USD=200USD లాభం వస్తుంది.

అలా కాకుండా SGX nifty లో 100 పాయింట్లు పడితే 100*2USD=200USD నష్టం వస్తుంది.

 

ఇప్పుడు మనం SGX nifty టైమింగ్స్ గురించి మాట్లాడుకుందాం:

 

మన ఇండియాలో ఉన్న టైం కి సింగపూర్ లో ఉన్న టైం కి రెండున్నర గంటలు తేడా ఉంటుంది.

ఉదాహరణకు: మనకి ఇక్కడ 6:00AM అయితే సింగపూర్ లో 8:30AM అవుతుంది. మన ఇండియాలో స్టాక్ మార్కెట్ 9:15AM కి ఓపెన్ అయి 3:30APM కి క్లోజ్ అవుతాయి కానీ SGX nifty అలా కాదు అది 6:30AM కి ఓపెన్ అయ్యి మరుసటి రోజు 2:45 వరకూ నిరంతరంగా ట్రేడవుతోంది

మన స్టాక్ మార్కెట్లు ఆరు గంటలు ట్రేడ్ అయితే SGX Nifty దాదాపు ఇరవై గంటలు ట్రేడవుతోంది. ఒక్కొక్కసారి మన స్టాక్ మార్కెట్లో మూతబడి ఉంటాయి కానీ SGX Nifty మాత్రం నిరంతరంగా గ్లోబల్ న్యూస్ ప్రకారం ట్రేడ్ అవుతాయి.

ఈ SGX Nifty ఇండికేషన్ ప్రకారం ఆ మరుసటి రోజు మన స్టాక్ మార్కెట్ లో ఎలా ఓపెన్ అవుతాయి అని అంచనా వేస్తాం.

 

SGX NIFTY లో ట్రేడ్ చేయొచ్చా:

 

SGX Nifty లో మనం ట్రేడ్ చేయలేము ఎవరికి అయితే మన నిఫ్టీ లో ట్రేడ్ చెయ్యడానికి అవకాశం ఉండదో వాళ్ళు SGX Nifty లో ట్రేడ్ చేస్తారు.

ఉదాహరణకు: FIIS(FINANCIAL INSTITUTION INVESTORS),NRI’s వీళ్లు SGX Nifty లో ట్రేడ్ చేస్తారు.

 

SGX Nifty ని ఎక్కడ చెక్ చేయాలి:

 

SGX Nifty నీ investor.com లేదా money control లో చెక్ చేయవచ్చు. అది ఎలా చెక్ చేయాలో కింద నేను వీడియో లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేసి చూడండి.

CLICK HERE

ఇప్పుడు మనం SGX Nifty తో ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది మాట్లాడుకుందాం:

 

మన స్టాక్ మార్కెట్లు క్లోజ్ లో ఉన్నప్పుడు గ్లోబల్ స్టాక్ మార్కెట్లో ఏదైనా సమస్య లాగా ఉంటే ఈ SGX Nifty మనకి సూచీల ఉపయోగపడుతుంది ఇది నిరంతరంగా క్రియేట్ అవుతుంది కాబట్టి మనం ముందుగానే నిఫ్టీ లో కదలికను గమనించవచ్చు.

మామూలుగా sgx nifty బట్టే మన స్టాక్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి కానీ ఒక్కొక్కసారి sgx nifty నెగిటివ్ లో ఉన్నా కూడా మన స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాదాపు మన ఇండియన్ ట్రేడర్లు ఈ SGX Nifty నే ఫాలో అవుతారు.

About The Author

Scroll to Top