Technical and Fundamental Analysis

What is Fundamental and Technical analysis in Telugu?

Fundamental and Technical Analysis అంటే ఏమిటి:

ఈరోజు మనం స్టాక్ మార్కెట్ లోని రెండు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం అది Fundamental and Technical Analysis.

Technical and Fundamental Analysis

What is Fundamental Analysis?

మనం ముందు ఫండమెంటల్ అనాలసిస్ గురించి మాట్లాడుకుందాం ఫండమెంటల్ అనాలసిస్ అనేది ముఖ్యంగా ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా ఈ ఫండమెంటల్ అనాలసిస్ ని పాటించాలి.

Fundamental analysis

ఫండమెంటల్ అనాలసిస్ లో మనం గమనించాల్సింది ఒక కంపెనీ గురించి మరియు ఆ కంపెనీ ఏ వస్తువులను తయారు చేస్తుంది మరియు ఆ కంపెనీ గత ఫైనాన్షియల్ డేటా మరియు ఆ కంపెనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి అంతేకాకుండా ఆ కంపెనీ ఏ సెక్టార్ లో ఉంది ఉదాహరణకు ఫైనాన్షియల్ సెక్టార్ లేదా బ్యాంకింగ్ సెక్టార్ లేదా రిటైల్ సెక్టర్ ఇలా ఏ సెక్టార్ లో కంపెనీ ఉందో చూసుకొని దాన్నిబట్టి analasys చేసుకోవాలి.

Technical analysis chart

ఈ ఫండమెంటల్ అనాలసిస్ లో నేను మీకు ఒక కంపెనీని ఉదాహరణగా తీసుకొని చెబుతాను.

Technical analysis

మనం ITC అనే కంపెనీని తీసుకుందాం ఈ ITC కంపెనీ FMCG సెక్టార్ లోనిది ఇది ONE OF THE LEADING COMPANY IN FMCG SECTOR ఈ కంపెనీని 24 AUG 1910,KOLKATA లో స్టార్ట్ చేశారు.

ITC Image

ఫ్రెండ్స్ మీరు చూసే ఉంటారు మీరు ఏదైనా స్టోర్ కి వెళ్ళిన లేదా రిటైల్ షాప్ కి వెళ్ళిన ITC వస్తువులు మీకు కనిపిస్తుంటాయి మరియు ITC బ్రాండ్ కూడా మన ఇండియాలో తెలియని వారు ఉండరు SO, ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చెప్పండి ఈ ITC షేర్ ప్రైస్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఈ ITC షేర్ ప్రైస్ 332 లో ట్రేడవుతోంది. YES ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే ఈ షేర్ ప్రైస్332 లో ట్రేడవుతోంది. ఎందుకు ఈ షేర్ ప్రైస్ అన్నది ఇంత తక్కువ లో ట్రేడ్ అవుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలా అని ఈ కంపెనీ చిన్నది అని కాదు మరియు ప్రాఫిట్స్ రావట్లేదు అని కూడా కాదు ఇది ఇంత తక్కువ లో ట్రేడ్ అవ్వడానికి కారణం ఇప్పుడు నేను చెప్తాను ఈ ITC కంపెనీ అనేది వివిధ సెక్టార్లో రన్ అవుతుంది అంటే ఈ ITC ఓ హోటల్ సెక్టార్, టొబాకో మరియు రిటైల్ ఇలా వివిధ సెక్టార్లో ఉంది.

వీళ్ళకి టుబాకో సెక్టార్ నుంచి ఎక్కువ ప్రాఫిట్స్ మరియు రెవెన్యూ వస్తాయి హోటల్ మరియు రిటైల్ సెక్టర్ తో పోల్చుకుంటే. ఈ కంపెనీ షేర్ ప్రైస్ పెరగకపోవడానికి కారణం ఈ సెక్టార్ బిజినెస్ మొత్తం ఒకే దాంట్లో కలిసి ఉండడం వల్ల ఎప్పుడైతే ఈ సెక్టార్ మొత్తం డివైడ్ అవుతాయో అప్పుడు ఈ షేర్ ప్రైస్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది.

ITC కంపెనీ ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ కానీ ప్రైస్ యాక్షన్ లో మూమెంట్ అనేది ఉండదు చాలామంది చెప్తూ ఉంటారు ITC కంపెనీ చాలా పెద్దది కానీ ప్రైస్ ఎందుకు పెరగడం లేదు అని అది ఎందుకు పెరగడం లేదు అంటే నేను పైన చెప్పిన ఉదాహరణ వలనే.I HOPE మీకు ఉదాహరణ స్పష్టంగా అర్థం అయిందని అనుకుంటున్నాను.

ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఫండమెంటల్ గా మనం ఏమి చెక్ చేయాలి:

ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ లక్ష్యాలు అనేది చూడాలి అంతేకాకుండా ఆ కంపెనీ ఫైనాన్షియల్ డేటా అనేది చూడాలి ప్రతి కంపెనీ మూడు నెలలకు ఒకసారి దాని ఫలితాలను విడుదల చేస్తుంది ఆ ఫలితాలను కూడా పరిశీలిస్తూ ఉండాలి అంతేకాకుండా కంపెనీ మేనేజ్మెంట్ గురించి కూడా మనం అనాలసిస్ చేయాలి అంటే కంపెనీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అవి ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడే డిసిషన్ ఆ కాదా అని చెక్ చేస్తూ ఉండాలి అంతేకాకుండా కంపెనీ టార్గెట్ ని కూడా చూడాలి.NEXT కంపెనీకి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా కంపెనీ మీ విస్తరణ చేయడానికి అనేది చూడాలి అంతేకాకుండా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ డేటాను పరిశీలించాలి

మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ముఖ్యంగా ఈ పైన పాయింట్స్ ను చూడాలి. ఇవన్నీ మనం చూసుకున్న తరువాత మనం ఆ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి మనం కొన్ని కంపెనీలను అనలైజ్ చేశాక ఒక10-15 కంపెనీలను ఎంపిక చేసుకోవాలి ఇలా కొన్ని కంపెనీలను ఎంపిక చేశాక ఆ షేర్స్ కి సంబంధించిన కొన్ని ఫండమెంటల్ అంశాలను చూడాలి అంటే P/E RATIO , కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇలా ఈ అంశాలను పరిశీలించాలి P/E RATIO అనేది ఒక కంపెనీకి ఎక్కువ ఉండకూడదు అలా అని తక్కువ కూడా ఉండకూడదు(10-15 మధ్యలో ఉండాలి) ఇలా ఉంటే ఆ కంపెనీ షేర్లను ఇన్వెస్ట్ చేయడానికి పరిశీలించాలి.

కొన్ని కంపెనీలో డివిడెండ్ మరియు బోనస్ ప్రకటిస్తాయి అలాంటి కంపెనీలను కూడా ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపాలి. ఇలా పాయింట్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు ఎక్కడికీ పోవు ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇలా పైన చెప్పిన పాయింట్స్ అన్నీ ఫండమెంటల్ అనాలసిస్ లోకి వస్తాయి. ఇలా చూసుకున్న తర్వాత కూడా ఒక డౌట్ అనేది వస్తుంది అవి ఒక కంపెనీకి సంబంధించిన షేర్ ని ఏ ప్రైస్ లో కొనాలి మరియు ఏ టైంలో కొనాలి అని ఇవి మనం టెక్నికల్అనాలసిస్ ద్వారా తెలుసుకోవచ్చు.

What is Technical Analysis?

టెక్నికల్ అనాలసిస్ అనేది మనం ఒక స్టాక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ నీ గుర్తించడం కోసం ఉపయోగిస్తాము. ఇలా గుర్తించడానికి మనకి మార్కెట్లో చాలా ఇండికేటర్లు ఉన్నాయి కానీ అన్ని ఇండికేటర్లు అవసరం లేదు కొన్ని ఉపయోగిస్తే సరిపోతుంది.

Technical Analysis

ఉదాహరణకి మీరు ఒక స్టాక్ ని100 రూపాయల దగ్గర కొందాం అనుకున్నారు కానీ ఆ స్టాక్ ని ఏ ప్రైస్ దగ్గర కొనాలి అనేది ఈ టెక్నికల్ అనాలసిస్ లో తెలుసుకుంటాం.

ఈ టెక్నికల్ అనాలసిస్ అనేది హిస్టారికల్ డేటా తీసుకొని దాని ప్రైస్ ఆక్షన్ ఆధారంగా మనకు ఒక స్టాక్ ని ఎక్కడ కొనాలి మరియు ఎక్కడ అమ్మాలి అనేది చూపిస్తుంది.

ఈ టెక్నికల్ అనాలసిస్ లో మనం 2 ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి అవి SUPPORT మరియు RESISTENCE.

Support and Resistance image

What is Support?

SUPPORT ZONE అంటే ఒక స్టాక్ కిందకి వస్తున్నప్పుడు అది ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అని దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇది ప్రైస్ యాక్షన్ హిస్టరీ మీద చెప్పబడుతుంది.

What is Resistance?

RESISTENCE ZONE అంటే ఒక స్టాక్ కంటిన్యూగా పెరుగుతున్నప్పుడు ఎక్కడి వరకు ఇలా పెరగొచ్చు అని ముందుగానే ఊహించేది.

ఈ రెండూ ZONES గాని సరిగ్గా అనాలసిస్ చేయడం వచ్చినట్లయితే మనం ఒక స్టాక్ లోని ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి మరియు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని తెలుసుకోవచ్చు. చాలామంది ఈ SUPPORT మరియు RESISTENCE అనేది అనాలసిస్ చేయకుండానే ఒక స్టాక్ లోకి ఎంటర్ అవుతారు అలా వారు ఎంటర్ అయినప్పుడు ఆ స్టాక్ ప్రైస్ అనేది పడిపోతుంది వాలు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా పోతాయి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఈ అనాలసిస్ అనేది చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి

ఫండమెంటల్ అనాలసిస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉపయోగిస్తారు.

టెక్నికల్ అనాలసిస్ అనేది ట్రేడర్స్ ఉపయోగిస్తారు.

IF YOU WANT COMPLETE INFORMATION ABOUT THE TECHNICAL AND FUNDAMENTAL ANALYSIS WATCH THIS VIDEO

                                                                          CLICK HERE

About The Author

Scroll to Top