IPO process

How can a Company Get Listed in the Stock Market in Telugu?

How can a Company Get Listed in the Stock Market in Telugu?-ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఎలా వస్తుంది?

How can a Company Get Listed in the Stock Market in Telugu?

 

ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఎలా వస్తుంది?

How can a Company Get Listed in the Stock Market in Telugu: మనం రోజు న్యూస్ ఛానళ్లలో చూస్తూ ఉంటాం మరియు న్యూస్ పేపర్లలో చదువుతూ ఉంటాం సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు పెరిగింది మరియు నిఫ్టీ ఇన్ని పాయింట్లు పెరిగిందని అని అలాగే ఒక స్టాక్ ప్రైస్ ఒక ఇన్ని రూపాయలు పడింది మరియు ఇంత శాతం పడింది అని న్యూస్ లో వింటూ ఉంటాం.

అసలు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఎలా లిస్ట్ అవుతుంది లిస్ట్ అయ్యాక ఆ కంపెనీకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మరియు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి అర్హతలు ఏమి కావాలి మరియు మొత్తం ఒక కంపెనీ లిస్టింగ్ ప్రక్రియ ఇప్పుడు చూద్దాం.

What is IPO? IPO అంటే ఏమిటి?

ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో IPO ద్వారా లిస్ట్ అవుతుంది IPO అంటే INITIAL PUBLIC OFFERING అని అర్థం కంపెనీలకు ఫండ్స్ అవసరం ఉంటాయి కాబట్టి వాళ్లకు ఫండ్స్ కావాలి అంటే ఈ IPO ప్రక్రియ ఫాలో అయ్యి వాళ్ల కంపెనీలను స్టాక్ మార్కెట్ లో లిఫ్ట్ చేస్తారు.

How can a Company Get Listed in the Stock Market in Telugu?

చిన్న కంపెనీలు మరియు అప్పుడే వచ్చిన START UP కంపెనీలో GROW అవ్వాలి అంటే వాళ్లకి డబ్బు అనేది చాలా అవసరం పడుతుంది వాళ్లు ఆ డబ్బుని బ్యాంకు ద్వారా తీసుకోవచ్చు కానీ బ్యాంకు కి అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి బ్యాంకు ద్వారా తీసుకునే బదులు IPO ద్వారా వెళితే ఏ వడ్డీ లేకుండా డబ్బుని సమకూర్చి కంపెనీని DEVELOPE చేసుకోవచ్చు అని కంపెనీలు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయి. స్టాక్ మార్కెట్ ద్వారా ఫండ్స్ వాళ్లకు ఎలా వస్తాయంటే వాళ్ల కంపెనీలో ఉన్న షేర్స్ ని పబ్లిక్ కి ఆఫర్ చేస్తారు దానిద్వారా వచ్చిన డబ్బుని కంపెనీ DEVELOPE కోసం ఉపయోగించుకుంటారు.

IPO లోకి వచ్చినా కంపెనీ షేర్స్ ని మనం కొనవచ్చా అనే విషయాన్ని తెలుసుకుందాం:

ఏదైనా ఒక కంపెనీ IPO కీ వస్తే వాటిలో షేర్స్ ని మనం కొనవచ్చు. ఈ షేర్స్ కొనడానికి మనకి కచ్చితంగా ఒక DEMAT ACCOUNT అనేది అవసరం పడుతుంది. ఇప్పుడు ఆ కంపెనీ షేర్స్ ని ఎలా కొనాలో చూద్దాం

కంపెనీ IPO కి వచ్చేముందు దాని DETAILS ప్రకటిస్తుంది అంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఎంత? మరియు ఏ తేదీ నుంచి తేదీ వరకు మనం ఆ షేర్లను కొనవచ్చు అలాగే ఒక కంపెనీని మార్కెట్లోకి స్టేట్ అప్పుడు MARKET LOT అనేది ప్రకటిస్తుంది అంటే

ఉదాహరణకి ఒక కంపెనీ 1 MARKET LOT= 40 SHARES అని షేర్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ప్రకటిస్తే కచ్చితంగా మనం ఆ 40 SHARES అంటే 1 LOT కొనాలి.

ఏ కంపెనీ IPO’S లో అయినా ప్రవేశించాలంటే మన దగ్గర 15000/- ఉండాలి అది కూడా ఒక LOT వేయాలంటే. మనం రిటైలర్స్ కేటగిరీలోకి వస్తాం కాబట్టి మనకి 13 LOTS వరకు ఛాన్స్ ఉంటుంది అంటే MINIMUM 1 LOT మరియు MAXIMUM 13 మాత్రమే వేయగలుగుతారు.

మనం ఒక కంపెనీలో IPO కి అప్లై చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి:

ఒక కంపెనీలో IPO కీ అప్లై చేసే ముందు ఆ కంపెనీ చరిత్రను తెలుసుకోవాలి అంటే ఆ కంపెనీ ఏ సెంటర్ లో ఉంది ఏ సర్వీస్ ను అందిస్తుంది అది ఏం తయారు చేస్తుంది మరియు ఆ కంపెనీ భవిష్యత్తులో మంచి GROWTH ఉంటుందా ఇలా కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలి.

కంపెనీ మేనేజ్మెంట్ గురించి కూడా మనం ముందే అనాలసిస్ చేయాలి

కంపెనీ IPO కీ వచ్చేటప్పటికీ మార్కెట్ల కండిషన్ కూడా మనం కోవాలి ఎందుకంటే మార్కెట్లు డౌన్లో ఉన్నప్పుడు IPO వస్తే అది ప్రీమియం లో కాకుండా డిస్కౌంట్ లో లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంటే POSITIVE లో కాకుండా NEGATIVE లో లిస్ట్ అవ్వచ్చు.

కంపెనీ ఏ వ్యాల్యూ షన్లో వస్తుందో కూడా చూసుకోవాలి అంటే ఉదాహరణ కి ఒక కంపెనీ IPO కి వచ్చేటప్పుడు షేర్ ప్రైస్ ఆ కంపెనీయే నిర్ణయిస్తుంది కాబట్టి ఆ కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం షేర్ ప్రైస్ 100 ఉండొచ్చు కానీ ఆ కంపెనీ షేర్ ప్రైస్ నీ 300 రూపాయలు గా నిర్ణయించే IPO లో అమ్మడం జరుగుతుంది అంటే NORMAL PRICE కన్నా రెండు వందల రూపాయలు ఎక్కువ కి మనకు అమ్ముతుంది కాబట్టి ఇలాంటి IPO’S కి దూరంగా ఉండాలి.

మీరు ఒక కంపెనీ IPO కి అప్లై చేయాలంటే కచ్చితంగా పైన చెప్పిన పాయింట్ లను గుర్తుంచుకోవాలి.

ఒక కంపెనీ IPO కి రావాలంటే దాని పద్ధతిని చూద్దాం:

ఏదైనా ఒక కంపెనీ IPO కి రావాలి అంటే దానికి SEBI అనుమతి తప్పనిసరి. SEBI అంటే SECURITIES AND EXCHANGE BOARD OF INDIA . దీనిని APRIL 12 1988 లో స్థాపించారు. SEBI స్టాక్ మార్కెట్ కి ఒక రెగ్యులేటరీ బోర్డు లా పనిచేస్తుంది స్టాక్ మార్కెట్ లో అవకతవకలు జరగకుండా ఈ బోర్డ్ అనేది చూసుకుంటుంది.

SEBI అనుమతి కావాలంటే కంపెనీ దానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్,DRHP మరియు RHP ఇవి మొత్తం అందజేయాల్సి ఉంటుంది. ఇలా చేశాక SEBI ఆ కంపెనీ ప్రొఫైల్ ని ఫిలిం చి IPO కి అనుమతిస్తుంది. ఇలా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి వస్తుంది.

ఇప్పుడు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి లిస్ట్ అవ్వడం వల్ల దానికి ఉపయోగం ఏముంటుంది?

ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఫండ్స్ కంపెనీ లో ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది దానిద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది మరియు కంపెనీని DEVELOPE చేయడానికి సరిపోయే ఫండ్స్ ఉంటాయి.

స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం వల్ల ఆ కంపెనీ బ్రాండ్ వాల్యూ అనేది కూడా పెంచుకోవచ్చు.

ఇలా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి లిస్ట్ అయితే ఫండ్స్ ఎలా వస్తాయో మరియు ఆ కంపెనీకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో మనం ఇప్పుడు చూశాం. ఇందుకే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వాలని కోరుకుంటుంది.

IF YOU WANT DETAIL INFORMATION ABOUT THIS TOPIC PLEASE WATCH THIS VIDEO. “CLICK HERE”

About The Author

Scroll to Top