2008 Recession

2008 Great Recession Explained in Telugu.

2008 లో Great Recession ఎలా వచ్చింది? దానికి గల కారణాలు ఏంటి?

2008 GREAT RECESSION-2020లో కరోన వచ్చినప్పుడు మన దేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ లన్ని కుప్పకూలిపోయాయి అది చూసిన చాలామంది ఇంతటి దారుణమైన పరిస్థితి ఇప్పుడే వచ్చిందని అనుకున్నారు కానీ కరోనా వల్ల వచ్చిన ఆర్థిక మాంద్యం కంటే అంతకుముందు చాలా Recessions వచ్చాయి అందులో

1.1930 లో వచ్చిన GREAT DIPRESSION

2.2000 లో వచ్చిన DOT COM BUBBLE CRASH

3.2008 లో వచ్చినా THE GREAT RECESSION

అయితే నేను మీకు ఈరోజు చెప్పబోయేది 2008లో వచ్చిన THE GREAT RECESSION గురించి. అసలు 2008 లో GREAT RECESSION ఎలా, ఎప్పుడు, ఎందుకు, వచ్చింది. దీనికి గల కారణాలు ఏమిటి. అందరికంటే అమెరికా ఎక్కువ ఎందుకు నష్టపోయింది. అమెరికా నష్టపోవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఏ విధంగా నష్టపోయాయి.

2008 Recession

ముందుగా మీరు 1930 లో వచ్చినా DIPRESSION మరియు 2008 వచ్చినా RECESSION అర్థాలు తెలుసుకోవాలి. DIPRESSION అంటే ఏదైనా ఒక దేశం GDP GROWTH RATE కొన్ని సంవత్సరాల పాటు నెగిటివ్ లో కి వెళ్ళిపోతే దానిని DIPRESSION అంటారు. RECESSION అంటే GDP GROWTH RATE కొన్ని వారాల నుండి నెలలపాటు నెగిటివ్ లో ఉంటే దానిని RECESSION అంటారు అదే GDP GROWTH RATE కొన్ని నెలల నుండి సంవత్సరాల పాటు ఉంటే దానినే THE GREAT RECESSION అంటారు.2008 సంవత్సరం లో వచ్చింది GREAT RECESSION. ఇప్పుడు 2008 లో THE GREAT RECESSION ఎలా స్టార్ట్ అయ్యింది అనేదాని గురించి చూద్దాం.

Recession

1996 లో US లో DOT COM BOOM నడుస్తుంది దీనివల్ల సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీస్ కి సంబంధించిన స్టాక్స్ విపరీతంగా పెరగడం మొదలయ్యాయి కొన్ని సంవత్సరాల తరువాత అంటే 2000 నుండి 2002 మధ్యలో ఈ DOT COM BUBBLE అనేది CRASH అయ్యి సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన స్టాక్ ప్రైస్ లో సెల్లింగ్ రావడం మొదలయ్యాయి. దీనివల్ల ప్రజలందరూ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన మనీని విత్ డ్రా చేసుకోవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా 2001 లో TWIN TOWERS పై అటాక్ కూడా జరిగింది ఈ రెండు సంఘటనల వల్ల US లో ఎకానమీ దారుణంగా పతనమయ్యింది. దీనివల్ల US FED ఇంట్రెస్ట్ రేట్లను భారీగా తగ్గించింది ఇలా తగ్గించడానికి కారణం దేశం యొక్క ఎకానమీ మరియు మార్కెట్లలో స్టెబిలిటీ ని తీసుకొని రావడానికి అయితే ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లను చాలాసార్లు తగ్గించింది.

Recession DOTCOM BUBBLE

 

6.75% ఉన్న వడ్డీ రేట్ ని 1.75% వరకూ తీసుకు వచ్చింది ఇలా ఇంట్రెస్ట్ రేట్ లను భారీగా తగ్గించే సరికి ఇన్వర్టర్ లందరూ బ్యాంకులలో తమ డబ్బులను డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపించలేదు పోనీ తమ డబ్బుని స్టాక్ మార్కెట్లలో పెడదామనుకున్నా మార్కెట్లు కూడా నెగిటివ్ లో ఉన్నాయి. ఈ DOT COM BUBBLE వల్ల స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టడానికి ఇన్వెస్టర్ లందరూ వణికిపోయారు మంచి ఇన్వెస్ట్ మెంట్ ప్లేస్ కోసం ఇన్వెస్టర్ల అందరూ ఎదురుచూస్తున్నారు అదే టైంలో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ మెల్లగా పెరుగుతున్నాయి.

Recession US FED

US గవర్నమెంట్ కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ ప్రాపర్టీస్ కొనమని ప్రోత్సహిస్తుంది ఒకవైపు స్టాక్ మార్కెట్లలో పతనం మరోవైపు US లో ఇంట్రెస్ట్ రేట్ లను తగ్గించే సరికి ఇన్వెస్టర్ లందరూ అప్పుడే ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ సెక్టార్ పై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా వడ్డీ రేట్లు తక్కువ ఉండేసరికి భారీగా లోన్లు తీసుకొని వాళ్ల అవసరాలు అయినా కార్లు ,మొబైల్ ,హౌసెస్ ,ల్యాండ్స్ వంటివి తీసుకున్నారు. తక్కువ ఇన్కమ్ లో క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్లు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ లోన్ ల కోసం ట్రై చేశారు నార్మల్ గా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్లకు మరియు low-income ఉన్నవాళ్లకు బ్యాంకులు భారీగా లోన్స్ అనేవి ఇవ్వవు కానీ ఆ టైంలో లో ఇన్కమ్ క్రెడిట్ స్కోర్ లేని వారికి కూడా తాకట్టు పై లోన్ లు ఇచ్చారు.

Recession Credit score

చాలామంది తమ దగ్గర ఉన్న ప్రాపర్టీ నీ తాకట్టు పెట్టి బ్యాంకులలో తక్కువ వడ్డీ రేటుకి లోన్స్ తీసుకోవడం ప్రారంభించారు.బ్యాంకులు అప్పట్లో లోన్స్ ఎలా ఇచ్చాయి అంటే ప్రతి ఒక్కరికి సులభంగా లోన్స్ వచ్చేవి అయితే ఈ లోన్స్ తీసుకునే వాటిలో హోమ్ లోన్స్ ఎక్కువగా రిస్క్ అని బ్యాంకులకు తెలుసు ఎందుకంటే అవి డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అందుకే బ్యాంకులు లోన్ తీసుకునే వ్యక్తి దగ్గరనుంచి ప్రాపర్టీస్ ని తాకట్టు పెట్టుకునేవి ఒకవేళ ఆ వ్యక్తి డబ్బులు కట్టకపోతే అతను తాకట్టు పెట్టిన ప్రాపర్టీని అమ్మి వసూలు చేసుకోవచ్చని అనుకున్నాయి ఇలా ఒకవైపు వడ్డీ రేట్లు తక్కువ ఉండేసరికి జనాలు ఎక్కువ లోన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపించారు బ్యాంకులు కూడా అడ్డూ అదుపు లేకుండా వాళ్ల ప్రాపర్టీస్ ని తాకట్టు పెట్టుకు నీ భారీగా ఇన్వెస్టర్ల కీ జనాలకి లోన్లు ఇవ్వడం ద్వారా లిక్విడిటీ ఇష్యూ ఏర్పడింది. ఈ లిక్విడిటీ ఇష్యూ అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు అయిపోవడం ఈ లిక్విడిటీ ఇష్యూ ని సాల్వ్ చేయడం కోసం బ్యాంకులు ఏం చేశాయి అంటే తమ దగ్గర లోన్లు తీసుకున్న కొన్ని లక్షల మంది తాకట్టు పత్రాలన్నీ కొన్ని BUNDLE లా చేసి THIRD PARTY COMPANIES అయినా కార్పొరేషన్స్ ఇన్వెస్టర్స్ పెన్షన్ ఫండ్స్ కు అమ్మి వేశాయి.

Recession Home loan

ఈ THIRD PARTY COMPANIES ఆ తాకట్టు పత్రాలను తమ వద్ద ఉంచుకుని దానికి బదులు క్యాష్ ని బ్యాంకులకు ఇచ్చేవి ఈ ప్రాసెస్ ద్వారా బ్యాంకులకు ఏర్పడ్డ లిక్విడిటీ ఇష్యూ ని సాల్వ్ చేసుకున్నాయి ఈ ప్రాసెస్ లో బ్యాంకులో THIRD PARTY COMPANIES కీ అమ్మిన తాకట్టు పత్రాలను తీసుకొని బ్యాంకులకు డబ్బులు ఇవ్వడానికి కారణం లోన్ కట్టే వ్యక్తి ఇంట్రెస్ట్ తో సహా లోన్ కడతారు కాబట్టి ఆ డబ్బులన్నీ. ఈ THIRD PARTY COMPANIES కీ వెళ్తాయి ఒకవేళ లోన్ కట్టే వ్యక్తి సకాలంలో డబ్బులు చెల్లించక పోయినా లేక అతనికి చెల్లించే స్తోమత లేకపోయినా అతను తాకట్టు పెట్టిన ప్రాపర్టీ బ్యాంకులకు బదులు ఈ THIRD PARTY COMPANIES స్వాధీనం చేసుకుంటాయి. దీనివల్ల ఎంతోకొంత లాభం వస్తుంది కాబట్టి THIRD PARTY COMPANIES తాకట్టు పత్రాలను తమ వద్ద పెట్టుకొని బ్యాంకులకు డబ్బులు ఇచ్చాయి. అయితే ఈ తాకట్టు పత్రాలలో ఎక్కువగా హోమ్ లోన్ కి సంబంధించిన పత్రాలు ఉండేవి ముందే చెప్పినట్టు హోమ్ లోన్ అనేది చాలా సంవత్సరాలు ఉంటుంది కాబట్టి డిఫాల్ట్ అయ్యే చాన్స్ ఎక్కువ ఈ రిస్కు ని THIRD PARTY COMPANIES ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ రిస్కు ని తగ్గించడానికి అమెరికాలో అతిపెద్ద మరియు ఫేమస్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా AIG(AMERICAN INTERNATIONAL GROUP) THIRD PARTY COMPANIES కోసం ఒక సపరేట్ పాలసీ తీసుకు వచ్చింది ఆ పాలసీ పేరు CDS(CREDIT DEFAULT SWAPS) ఇక్కడ నుండి 2008 THE GREAT RECESSION కీ అడుగులు పడడం మొదలయ్యాయి.AIG కంపెనీ ఏం చేసిందంటే THIRD PARTY దగ్గర ఉన్నా తాకట్టు పత్రాలకు ఇన్సూరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఒకవేళ ఏదైనా డిఫాల్ట్ అయితే ఆ లాస్ మొత్తం ఈ AIG భరిస్తుంది. ఏవైతే THIRD PARTY COMPANIES ఈ AIG దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటాయో వాటికి రిస్క్ ఉండదు అమెరికాలో అతిపెద్ద కంపెనీ అయినా AIG ఇలా ఇన్సూరెన్స్ పాలసీ నే తీసుకు వచ్చే సరికి THIRD PARTY COMPANIES అన్ని తమ రిస్కు ని తగ్గించుకోవడానికి AIG ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ ని భారీగా కొనుగోలు చేయడం స్టార్ట్ చేశాయి ఇది చూసిన మిగతా దేశాల ఇన్వెస్టర్లు కార్పొరేషన్ల నీ బ్యాంకుల దగ్గర నుండి తాకట్టు పత్రాలను కొనుక్కొని AIG లో ఇన్సూరెన్స్ చేయించడం ప్రారంభించాయి ఇలా చాలామంది AIG యొక్క ఇన్సూరెన్స్ కొనుక్కోవడం వల్ల AIG కీ భారీ మొత్తంలో లాభాలు రావడం మొదలయ్యాయి కానీ ఈ AIG కంపెనీ ఇన్సూరెన్స్ అమ్మడం వల్ల వచ్చే లాభాలను మాత్రమే చూసింది ఒకవేళ డిఫాల్ట్ అయితే వచ్చే నష్టాన్ని అంచనా వేయలేకపోయింది ఒకవైపు వడ్డీ రేట్లు తక్కువ ఉండడం వల్ల జనాలందరూ ఎగబడి లోన్స్ తీసుకొని ప్రాపర్టీస్ కొనడం స్టార్ట్ చేశారు దీనివల్ల రియల్ ఎస్టేట్ సెక్టార్ అమాంతం పెరగడం స్టార్ట్ అయింది.

AIG

బ్యాంకులు కూడా అత్యాశతో ఎవరికి పడితే వాళ్లకు లోన్స్ ఇస్తూ డబ్బులు సరిపోక వాళ్ల దగ్గర ఉన్నా తాకట్టు పత్రాలను THIRD PARTY COMPANIES కి అమ్మి వేయడం స్టార్ట్ చేశాయి THIRD PARTY COMPANIES కూడా అత్యాశతో తమకు డబ్బులు వస్తాయని అలాగే AIG లాంటి కంపెనీ తాకట్టు పత్రాలకు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావడంతో బ్యాంకుల దగ్గర నుంచి ఎగబడి మరి THIRD PARTY COMPANY తాకట్టు పత్రాలను కొన్నారు. తాకట్టు పత్రాలను కొన్నాక THIRD PARTY COMPANIES అన్ని AIG కంపెనీ దగ్గర డబ్బులు పెట్టి ఇన్సూరెన్స్ చేయించారు. ఇప్పుడు ఎవరైతే బ్యాంకులో లోన్ తీసుకున్నారో వారు లోన్ కట్టకపోతే ఆ రిస్క్ అంతా బ్యాంకులపై ఉండదు ఎందుకంటే వారు ఆ రిస్కు ని THIRD PARTY COMPANY కీ MOVE చేశారు పోనీ THIRD PARTY COMPANIES పై రిస్క్ ఉంటుందా అంటే ఉండదు ఈ THIRD PARTY COMPANIES వాటి రిస్కు ని AIG కీ MOVE చేశారు. ఇప్పుడు ఆ రిస్క్ అంతా AIG మీద ఉంటుంది కానీ ఈ AIG ఏమి అనుకుంది అంటే లోన్ కటక పోయె వారి కంటే కట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్టని వాళ్ళ వల్ల పెద్ద రిస్కు ఉండదు అని అనుకుంది.

 Real estate sector

ఇలా 2000 వ సంవత్సరం నుండి 2006 వరకు కొనసాగింది 2006 లో ఫెడరల్ రిజర్వ్ 1.75% నుండి 5% వరకు అమాంతం పెంచింది దీనివల్ల చాలామంది పెరిగిన లోన్ భారాన్ని భరించలేక లోన్ కట్టడాన్ని ఆపేశారు జనాలందరూ లోన్ కట్టక పోయేసరికి బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టుకున్న ప్రాపర్టీస్ అన్ని అమ్మడం మొదలు పెట్టాయి. ఇలా మార్కెట్లలో ఎక్కువ మొత్తంలో హౌసింగ్ ప్రాపర్టీస్ అన్ని అమ్మకంలో ఉండేసరికి రియల్ ఎస్టేట్ సెక్టార్ మొత్తం దారుణంగా పడిపోయింది ఇళ్ల ధరలు భారీగా పడిపోయాయి ఎవరైతే లోన్ తీసుకొని ఇళ్లను కొనుక్కున్నారు వాళ్లు కట్టే లోన్ కంటే ఇళ్ల ధరలే చాలా తక్కువ అయ్యాయి దీనివల్ల సక్రమంగా లోన్ కడుతున్న వారు కూడా లోన్ కట్టడాన్ని ఆపేశారు లోన్ కట్టని వాళ్ళ కంటే కట్టే వాళ్ళు కూడా కట్టక పోయేసరికి అమెరికా లోని బ్యాంకులన్నీ డిఫాల్ట్ అయ్యాయి ముఖ్యంగా అమెరికా లోని ముఖ్య బ్యాంక్ అయినా LEHMAN BROTHERS దివాలా తీసింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది ఎలాగో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి THIRD PARTY COMPANIES దగ్గర ఉన్నా తాకట్టు పత్రాలను వ్యాల్యూ లేకుండా పోయింది.THIRD PARTY COMPANIES తాకట్టు పత్రాలకు ఇన్సూరెన్స్ చేశారు కాబట్టి ఆ కంపెనీలన్నీ AIG దగ్గరకు వెళ్లి తమ ఇన్సూరెన్స్ ని CLAIM చేసుకోవడం స్టార్ట్ చేశాయి కొన్ని రోజుల్లోనే AIG దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి దీనివల్ల ఇన్సూరెన్స్ తీసుకున్నా వారు ఎవరికీ డబ్బులు ఇవ్వలేక చివరికి 2008 లో AIG కంపెనీ కూడా దివాలా తీసింది అమెరికాలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ దివాలా తీయడంతో అమెరికా మాత్రమే కాకుండా ఆ కంపెనీతో సంబంధం ఉన్నా ప్రపంచ దేశాల ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం దివాలా తీశాయి దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది చూస్తుండగానే రియల్ ఎస్టేట్ ,బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సెక్టార్ లన్నీ దివాలా తీశాయి.

Recession Downfall

దీనికి గల కారణం బయట దేశాల ఇన్వెస్టర్లు కార్పొరేషన్లో గవర్నమెంట్ కంపెనీలన్నీ అమెరికాలో వడ్డీరేట్లు తక్కువ ఉండేసరికి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు దీనివల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్ని దివాలా తీసాయి కాబట్టి ఈ CRISIS కి THE GREAT RECESSION అని పేరు పెట్టారు అయితే ఈ RECESSION నుండి ప్రపంచ దేశాలు అన్ని కోలుకోవడానికి 3 సంవత్సరాల టైం పట్టింది.

About The Author

Scroll to Top