Big Bazaar

Big Bazaar Rise and Fall Story in Telugu-Big Bazaar Case Study

BIG BAZAAR THE RISE AND FALL:

 

BIG BAZAAR గురించి మీ అందరికీ తెలుసు బిగ్ బజార్ లో మనకి కావలసిన వస్తువులన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. ఇలాంటి బిగ్ బజార్ ఎందుకు కనుమరుగైపోయింది? బిగ్ బజార్ ని రిలయన్స్ కు ఎందుకు అమ్మేశారు? బిగ్ బజార్ THE RISE AND FALL STORY గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం.

Big Bazaar

ఇండియాలో ఉన్న 125 ముఖ్యమైన సిటీలలో దాదాపు 300 బిగ్ బజార్ స్టోర్ లు ఉన్నాయి. ఇది ఒకప్పుడు ఇండియాలోనే అతి పెద్ద మార్కెట్ చేయి కలిగినది. ఒకప్పుడు ఈ బిగ్ బజార్ ప్రతి సిటీలో ఉండేది కానీ ఇప్పుడు ఇది ప్రపంచానికి తెలియకుండానే కనుమరుగై పోయింది.

ఈ BIG BAZAAR ని స్థాపించక ముందు మనకి అన్ని వస్తువులు ఒక దగ్గర దొరికేది కాదు. బిగ్ బజార్ నీ స్థాపించిన KISHORE BIYANI గారు ఒక గట్టి సంకల్పంతో వస్తువులను ఒకే దగ్గర దొరికేలా చేయాలనుకుని మొదలు పెట్టింది ఈ బిగ్ బజార్.

KISHORE BIYANI గారు1961 ముంబైలో మార్వాడి కుటుంబంలో గారు మొదట్లో KISHORE BIYANI గారి కుటుంబం బట్టల బిజినెస్లో ఉండేవారు అయితే ఇది అభివృద్ధి చెందలేదు.

kishore biyani founder of Big Bazaar

2001 లో KISHORE BIYANI గారు రిటైల్ విభాగం చాలా బాగా అభివృద్ధి చెందుతుందని గ్రహించి ఈ బిగ్ బజార్ నీ మొదలుపెట్టారు అయితే దీనిని మొదట కోల్కతాలో స్టార్ట్ చేశారు. బిగ్ బజార్ లోకి ఒకసారి అడుగు పెడితే మళ్లీ బయటకు రాకుండా అన్ని సామాన్లు ఒకే దగ్గర దొరికే తట్టు మరియు ప్రజలు ఏదో ఒక వస్తువు కొనేటట్టు వీరు చేశారు దీంతో కోల్కతా స్టోర్ సూపర్ సక్సెస్ అయ్యింది తరువాత మెట్రో సిటీస్ దా పిలువబడే హైదరాబాద్ మరియు బెంగళూరు సిటీ లో కూడా మొదలు పెట్టారు.50 శాతం డిస్కౌంట్ మరియు 1+1 ఆఫర్స్ అన్ని పెట్టడంతో ఇండియాలో ఈ బిగ్ బజార్ ని ఎక్కడ స్థాపించిన మంచి ఫలితం అయితే చూపించింది. KISHORE BIYANI గారు మంచి నిర్ణయాలు తీసుకుని బిగ్ బజార్ నీ అప్పట్లో మొదటి స్థానంలో ఉంచారు అంతేకాకుండా అప్పట్లో రిటైల్ విభాగంలో బిగ్ బజార్ ఏ నెంబర్ 1 మరియు ఇంతటితో ఆగకుండా బిగ్ బజార్ కి లాభాలు కూడా విపరీతంగా రావడం మొదలయ్యాయి.

ఈ BIG BAZAAR వల్ల కొన్ని చిన్న కంపెనీలు మూతపడడం కూడా జరిగింది.2019 నాటికి దేశంలో మొత్తం 350 బిగ్ బజార్ స్టోర్ లు ఉన్నాయి. అప్పటికే 30,000 కోట్ల బ్రాండ్ ఈ బిగ్ బజార్. బిగ్ బజార్ తోడు కాకుండా PANTALOONS,BRAND FACTORY,FBB ఇలా ఇవి కూడా స్థాపించి వీటి అన్ని విజయాలతో KISHORE BIYANI గారు రీటైల్ విభాగంలో NO.1 ఎదిగారు. ఆయన స్థాపించిన అన్నీ కంపెనీలను కలిపి ఫ్యూచర్ గ్రూప్ అంటారు.

Big Bazaar pantaloons

బిజినెస్ లో విజయాలు మరియు ఓటములు అనేది సర్వసాధారణం చాలామంది మొదట్లో ఓటములను చూసి తర్వాత విజయం అవుతారు కానీ ఇక్కడ KISHORE BIYANI గారు ఇంతటి విజయాన్ని చూశాక ఓటమి అవ్వడం అనేది జరిగింది. ఇంతలా సక్సెస్ అయిన బిగ్ బజార్ పడిపోవడానికి కారణం ఏమిటని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బజార్ పతనం 2009 నుంచి మొదలయిందని చెప్పుకోవచ్చు 2008 లో వచ్చినా ఆర్థిక మాంద్యం వల్ల ఇతని చాలా కంపెనీలు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి అంతేకాకుండా KISHORE BIYANI గారు ముందు వెనక చూడకుండా బ్యాంకులలో పెద్ద మొత్తంలో అప్పులను తీసుకొని వాటిని సరిగ్గా కట్టలేక 2012 వచ్చేసరికి ఆ కంపెనీ 8000 కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయింది. అంతేకాకుండా KISHORE BIYANI గారు హెరిటేజ్ మరియు ఈజీ డే లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయారు.

బిగ్ బజార్ పతనానికి ఇంకో కారణం బిగ్ బాస్కెట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ బిగ్ బాస్కెట్ ఒక కొత్త ఐడియా తో మార్కెట్లోకి వచ్చి బిగ్ బజార్ ని దెబ్బ కొట్టింది అని చెప్పుకోవచ్చు దీనివల్ల బిగ్ బజార్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది ఆ తర్వాత రిలయన్స్ సూపర్ మార్కెట్, గ్రాఫర్స్, మోర్ మరియు డి మార్ట్ ఇలా ఇవి ఎంటర్ అవ్వడంతో బిగ్ బజార్ బ్రాండ్ అనేది మొత్తంగా కనుమరుగైపోయింది. వెనక ముందు ఆలోచించకుండా భారీగా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం వల్ల 2019 వచ్చేసరికి అప్పు అనేది 12,800 కోట్లకు చేరింది దీనికితోడు 2020 లో వచ్చినా కోవిడ్ వల్ల ఫ్యూచర్ గ్రూప్ లో బ్రాండ్ ఫ్యాక్టరీ,FBB, బిగ్ బజార్ ఇవన్నీ మూత పడిపోయాయి దీనివల్ల నష్టాలు మరింత పెరిగిపోయాయి.

 Reliance photo

కోవిడ్ వల్ల KISHORE BIYANI గారి పరిస్థితి ఎలా మారిందంటే అప్పులను భరించలేక కంపెనీని అమ్మే దమ్ అనుకున్నా కొనడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు చివరికి 2020 AUGUST లో 24,700 కోట్లకు రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ నీ కుంటున్నట్లు బిగ్ బజార్ అధినేత KISHORE BIYANI గారు ప్రకటించారు.

రిలయన్స్ మరియు బిగ్ బజార్ డీల్ మధ్యలో అమెజాన్ ఎంట్రీ ఇచ్చింది ఎందుకంటే2019 లో అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ కి సంబంధించిన ఫ్యూచర్ కూపన్ స్లో200 కోట్ల తో 49 శాతం వాటా కొనింది. ఈ డీల్ ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ అమెజాన్ కి చెప్పకుండా తన ఆస్తులను అమ్మకూడదు కానీ KISHORE BIYANI గారు చెప్పకుండానే రిలయన్స్ తో డీల్ కుదుర్చుకున్నారు దీంతో అమెజాన్ కి కోపం వచ్చింది సింగపూర్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు సింగపూర్ కోర్టు ఈ డీల్ కి అడ్డు చెప్పింది కానీ రిలయన్స్ మాత్రం బిగ్ బజార్ స్టోర్ లను రిలయన్స్ రీటైల్ గా మార్చేసుకుంది కానీ రిలయన్స్ కి ఇక్కడే ఒక పెద్ద దెబ్బ తగిలింది ఫ్యూచర్ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల కి 24,700 కోట్లకి అమ్మడానికి ఇష్టం లేదు అందువల్ల డీల్ అనేది రద్దయింది అయితే విచారణ జరిగిన ఈ కేసు ఒక కొలిక్కి రావడం లేదు ఇంతలో ఫ్యూచర్ గ్రూప్ కి సంబంధించిన స్టోర్ల అగ్రిమెంట్లు ముగుస్తున్నాయి లీజ్ అమౌంట్ చెల్లించాలని ఒత్తిడి కూడా KISHORE BIYANI మీద పడుతుంది దీంతో అతని పరిస్థితి ఎలా మారిపోయిందంటే అటు అమ్ముకోలేక ఇటు బిజినెస్ నడుపు కోలేని పరిస్థితి అయిపోయింది. ఈ కంపెనీలతో పాటు KISHORE BIYANI గారు కూడా దివాలా తీశారు.

 Big bazaar Amazon

బిగ్ బజార్ ఫ్యూచర్ వెంచర్స్ గా స్టాక్ మార్కెట్ లోకి IPO ద్వారా APRIL 25 2011 నా వచ్చింది. స్టాక్ మార్కెట్లు లిస్ట్ అయ్యేటప్పుడు బిగ్ బజార్ ఒక్క షేరు ధర 10RS గా ఉండేది కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ షేరు ధర అనేది 3.60RS లో ట్రేడవుతోంది దీని అత్యధిక ధర 650RS వరకు వెళ్లి ఈ సంక్షోభం వల్ల ఇప్పుడు 3.60RS లో ట్రేడవుతోంది.

బిగ్ బజార్ అప్పుల లో కి వెళ్ళిపోయి దివాలా తీయడానికి కారణం KISHORE BIYANI గారి ఆలోచనలు మరియు బ్యాంకులో అప్పు అని చెప్పుకోవచ్చు.

IF YOU WANT COMPLETE INFORMATION ABOUT THIS YOU CAN WATCH THIS VIDEO CLICK HERE

About The Author

1 thought on “Big Bazaar Rise and Fall Story in Telugu-Big Bazaar Case Study”

Comments are closed.

Scroll to Top