Recession in 2022

IS RECESSION COMING TO INDIA?

ఇండియాకి Recession వస్తుందా? ఒకవేళ వచ్చినా రాకపోయినా బిగ్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ?

Recession in 2022

Recession in India-ఒక నెల క్రితం వచ్చినా న్యూస్ రిపోర్ట్స్ గమనించినట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియా లో Recession రావడానికి 0% ప్రాబబిలిటీ అని మనకి ఒక ఆర్టికల్ వచ్చింది.

Recession

Business standard న్యూస్ లో కూడా Aug 11th రోజు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు అందులో ఏముందంటే “There is no chances of Recession india” అని mention చేశారు.

అలాగే న్యూస్ సోర్సెస్ ప్రకారం ఫైనాన్స్ మినిస్టర్ అయినా నిర్మలా సీతారామన్ గారు కూడా మనకి ఇండియాలో Recession మరియు stagflation రావడానికి 0% ప్రాబబిలిటీ అని చెప్పారు.

Stagflation

ఇలా ఈ పాజిటివ్ మూమెంట్స్ ని గమనించే FII’S(FINANCIAL INSTITUTIONAL INVESTORS) గత కొన్ని నెలల క్రితం స్పెల్లింగ్ లో ఉన్నా కూడా ఆగస్టు మాత్రం 22,000CRS ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ట్రెండ్ అనేది సెప్టెంబర్ 12,13TH వరకు కంటిన్యూ అయి వచ్చింది. కానీ 13th సెప్టెంబర్ నుండి ఈ ట్రెండ్ అంతా మారిపోయి వచ్చింది. ఆగస్టు వరకు స్టాక్స్ ను కొనుగోలు చేస్తూ వచ్చిన FII’S సెప్టెంబర్ 2ND WEEK వరకు నెట్ BUYERS గా ఉన్నా కూడా నిన్నటి వరకు డేటాను గమనించినట్లయితే నెట్ SELLERS గా ఉంటున్నారు.

FII

అయితే ఇక్కడ మనకు Recession రాబోతుందా అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం Recession రాకపోవచ్చు కానీ ఇండియాకి Stagflation అని రిస్కు ఉంది. ఈ Staglation అంటే మనకి ఇండియాలో Inflation ప్రతి నెల కాలిక్యులేట్ చేస్తూ ఉంటారు 2021 లో మన Inflation 4.35-4.85 ఇలా ఉండేది 2022 వచ్చేసరికి 7.79 కి రీచ్ అయ్యింది. మనకి జనరల్ గా Inflation అనేది 4-6% మధ్యలో ఉంటుంది.4-6% మధ్యలో ఉంటే మన Inflation కంట్రోల్ లో ఉన్నట్టు అని అర్థం కానీ ఎప్పుడైతే మనకి >6.5-7 లెవెల్స్ రీచ్ అవుతుందో అలాంటప్పుడు మనకి Inflation అనేది ఒక బరువుగా మారుతుంది. మనం లాస్ట్ డేట్ గమనించిన కూడా 2018-2019 లో Inflation అనేది 2%-5% వరకు మాత్రమే రికార్డ్ అవుతూ ఉండేది. కోవిడ్ టైంలో మనకి Inflation అనేది విపరీతంగా పెరిగిపోయింది తరువాత కొంచెం తగ్గినా కూడా 2022 లో మళ్లీ Inflation అనేది పుంజుకుంది. ఇలా కంటిన్యూగా Inflation కొనసాగడానికి మనం Stagflation గా చెప్పుకుంటాం.

Inflation

Recession in India-ఈ Stagflation లో మనకి ఏం జరుగుతుందంటే(What Happens in stagflation)?

Elevated Raw Material Prices:

జనరల్ గా కొన్ని కంపెనీస్ కి ఏవైన మెటీరియల్ తయారు చేయాలంటే కొన్ని ముడిసరుకులు అవసరం పడుతుంది. ఈ ముడిసరుకుల ఖర్చు అనేది పెరిగిపోతాయి ఎప్పుడైతే ఈ ముడిసరుకులు ఖర్చు పెరుగుతుందో ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్ కూడా పెంచవలసి ఉంటుంది కానీ ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్ పెంచితే కన్జ్యూమర్ అంటే మనలాంటి కస్టమర్స్ కొనడానికి రెడీగా ఉండరు అందువల్ల ఫైనల్ గా తయారుచేసిన ప్రొడక్ట్ ఖర్చు పెంచలేరూ దానివల్ల కంపెనీ లాభాల మీద ప్రభావం పడుతుంది. ఇలాంటి లాభాలు ఫ్యూచర్ లో పెద్దగా పెరగవు కాబట్టి కంపెనీస్ నీ తొందరగా అమ్ముతూ ఉంటారు ఇన్వెస్టర్లు.

Increased in USD:

ఇలాంటి stagflation వల్ల US డాలర్ యొక్క రేటు కూడా పెరుగుతూ ఉంటుంది దీనివల్ల మనము ఇంపోర్ట్ చేసుకున్నా మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగి పోతూ ఉంటాయి.

Increase in Labour Cost:

అంతేకాకుండా లేబర్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాగా ఒక కంపెనీ యొక్క లాభాల మీద ప్రభావం అనేది చూపిస్తుంది. ఇలా లాభాలు ఎప్పుడైతే తగ్గడం ప్రారంభమవుతాయి కంపెనీల అనేవి తమ ఎంప్లాయిస్ ని తగ్గిస్తూ ఉంటుంది అందుకే 2023 లో IT కంపెనీ లు చాలా Layoffs చేయబోతున్నాయి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు చాలా జాబ్స్ పోతాయని మనకి ఇప్పటి నుంచే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అంటే మనకి ఈ Inflation నెక్స్ట్ ఇయర్ వరకు ఉండబోతుంది. అందుకే కంపెనీలు ముందు జాగ్రత్తగా ఎంప్లాయిస్ ను తగ్గిస్తూ వస్తుంది దీనిబట్టి మనకి Stagflation రావడానికి చాన్స్ అనేవి పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి Stagflation మనకి 2011,2012,2013 లో వచ్చాయి 2011 లో మనకి inflation 8% నీ క్రాస్ అయిపోయే 12% వరకు వచ్చింది 2014 వరకు 8% కంటే ఎక్కువే Inflation ఉంది.2015 నుంచి గమనించినట్లయితే మనకి inflation 6% కంటే తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి రాబోయే Stagflation వల్ల చాలా కంపెనీల మీద ప్రభావం అనేది చూపించొచ్చు అంటే కంపెనీలు తమ లాభాల మీద ప్రభావం అనేది చూడవచ్చు ఎప్పుడైతే కంపెనీల లాభాలు తగ్గుతూ ఉంటాయో అలాంటి కంపెనీల నుంచి ఇన్వెర్టర్ లో వెళ్ళి పోతూ ఉంటారు కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్వెస్టర్లు చాలా వరకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు

Recession in India-మరి ఇలాంటి బిగ్ ఇన్వెస్టర్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు?

మేజర్ గా FII’S 3 Sectors లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అందులో మనకి

Increase in interest rates:

జనరల్ గా ఇంట్రెస్ట్ రేట్ లో అనేవి పెంచుతూ ఉన్నారు ఎందుకంటే Inflation నీ కంట్రోల్ చేయడం కోసం. ఇంట్రెస్ట్ రేట్ లో పెంచడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అంటే బ్యాంకులకు మరియు ఫైనాన్షియల్ సర్వీస్ లకు కాబట్టి ఈ బ్యాంక్స్ మరియు ఫైనాన్షియల్ స్టాక్స్ పెద్దగా పడకపోవచ్చు.

Timely Passing on Cost Pressures:

మనకి ముడి సరుకులు ఖర్చు అనేది పెరుగుతూ వస్తోందని తెలుసు . ఈ ముడిసరుకుల ఖర్చు ఉన్నప్పుడు ఒక కంపెనీ తయారుచేసిన ఫైనల్ ప్రొడక్ట్ ఖర్చు పెంచగలిగిన ఒక సెక్టార్ ఏంటంటే అదే FMCG. ముడిసరుకుల ఖర్చు పెరగగానే ఈ FMCG కంపెనీలో కన్జ్యూమర్ మీదా భారాన్ని చూపిస్తాయి అందువల్ల ఈ కంపెనీలో లాభాలలో ఉండొచ్చు. అందువల్ల ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ FMCG సెక్టార్లో ఇన్వెస్టర్లు తమ డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

High Profit Margin Business Sector:

Stagflation వస్తే మెజారిటీ కంపెనీల లాభాలు తగ్గుతూ వస్తాయి కానీ ఒక సెక్టార్ ఫ్యూచర్ లో తమ ప్రాఫిట్ మార్జిన్ లోను భారీగా లాభాలను పొందవచ్చు అదే Auto Sector.

Auto Sector గత ఐదు నెలల నుంచి కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది.

ఇక్కడ మనకి Stagflation వచ్చినా కూడా ఈ 3 సెక్టార్ లను పాజిటివ్ కనబడుతుంది కాబట్టి FII’S భారీగా పెట్టుబడులను అనేది పెట్టారు. వచ్చే ఒక సంవత్సరంలో IT సెక్టార్ అనేది కొంచెం ఇబ్బందిలో ఉంది కాబట్టి FII’S వీటి మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ టైమ్ అని కూడా మనం భావించవచ్చు.

ఇప్పటివరకు FII’S మనకి బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ వీళ్లు మన ఇండియన్ మార్కెట్ల లో 47 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అందుకనే వీళ్ల డేటాను మనం ఫాలో అయితే ఫ్రెండ్ అనేది పాజిటివ్ గా ఉందా మరియు నెగిటివ్ గా ఉందా అని తెలుసుకోవచ్చు.

About The Author

Scroll to Top