స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?సెన్సెక్స్ మరియు నిఫ్టీ అంటే ఏమిటి ?What is Stock Market and What is sensex and Nifty?

స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?సెన్సెక్స్ మరియు నిఫ్టీ అంటే ఏమిటి ?What is Stock Market and What is SENSEX and NIFTY?

 

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ట్రేడింగ్ షేర్. ఫ్రెండ్స్ మీరు డైలీ న్యూస్ పేపర్స్ మరియు టీవీలలో సెన్సెక్స్ నిఫ్టీ గురించి వింటూ ఉంటారు. ఈరోజు మనం సెన్సెక్స్ మరియు నిఫ్టీ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం.

 

 

సెన్సెక్స్ మరియు నిఫ్టీ అంటే ఏమిటి?

 

సెన్సెక్స్ మరియు నిఫ్టీ అనేవి ఇండికేటర్స్ మనం రోజూ న్యూస్ లో స్టాక్ మార్కెట్ గురించి వింటూ ఉంటాం. న్యూస్ లో ఇలా చెబుతూ ఉంటారు నిఫ్టీ ఎన్ని పాయింట్లు పడింది మరియు సెన్సెక్స్ ఎన్ని పాయింట్లు పడింది అని వింటూ ఉంటాం. అవి ఎలా తెలుస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అవి ఎలా తెలుస్తాయి అంటే సెన్సెక్స్ మరియు నిఫ్టీ లో ఉన్నా షేర్ల ఆధారంగా లెక్కించ పడతాయి.

మన ఇండియాలో రెండు స్టాక్ ఎక్స్చేంజ్ లు ఉన్నాయి అవి BSE మరియు NSE దాదాపు అన్నీ కంపెనీ లు ఈ రెండు స్టాక్ ఎక్స్చేంజ్ లలో లిస్ట్ అయి ఉన్నాయి.

 

 

సెన్సెక్స్ అంటే ఏమిటి?

 

సెన్సెక్స్ అంటే BSE.BSE లో మెజారిటీ కంపెనీ లు పెరిగాయో మరియు తగ్గాయో అని తెలియజేసే ఇండికేటర్. నిఫ్టీ అంటే NSE. NSE లో ఉండే మెజారిటీ కంపెనీలు పెరిగాయో మరియు తగ్గాయో అని తెలియజేసే ఇండికేటర్.

మనకి BSE లో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి కానీ టాప్ లో ఉన్నా 30 కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా తీసుకుంటారు. ఇప్పుడు మనం BSE ఎలా పెరుగుతుంది మరియు ఎలా తగ్గుతుంది అనేదాని గురించి మాట్లాడుకుందాం.

ఉదాహరణ: BSE లో ఎన్ని పాయింట్లు పడ్డాయి మరియు ఎన్ని పాయింట్లు పెరిగాయి అని లెక్కించడానికి మొదటి లో ఉన్న 30 కంపెనీలను పరిగణలోకి తీసుకుంటారు.

30 కంపెనీలలో 20 కంపెనీలు పెరిగి మరియు 10 కంపెనీలు పడితే BSE పాజిటివ్ లో ఉందని అర్థం.

 

30 కంపెనీలలో 10 కంపెనీలు పెరిగి మరియు 20 కంపెనీలు పడితే BSE నెగిటివ్ లో ఉందని అర్థం.

 

1979 లో సెన్సెక్స్ ని 100 పాయింట్లతో స్టార్ట్ చేశారు ఇప్పుడు అది 59,500 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.

 

నిఫ్టీ అంటే ఏమిటి?

 

ఇప్పుడు మనం NSE గురించి మాట్లాడుకుందాం. BSE లో 30 కంపెనీలు పరిగణలోకి తీసుకుంటారు కానీ NSE లో మొదటి 50 కంపెనీలను పరిగణలోకి తీసుకుంటారు(ఈ మొదటి 50 కంపెనీలు అనేవి వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా టాప్ లో ఉంటాయి). అంటే 50 కంపెనీలలో ఎక్కువ కంపెనీలు ఆరోజు పెరిగితే నిఫ్టీ పాజిటివ్ లో ఉందని అర్థం. అలా కాకుండా ఆరోజు ఆ యాభై కంపెనీల లో నుంచి ఎక్కువ కంపెనీలు పడితే ఆ రోజు నిఫ్టీ నెగిటివ్ లో ఉందని అర్థం.

 

1994లో నిఫ్టీ 1000 పాయింట్లతో స్టార్ట్ అయింది ఇప్పుడు అది 17,500 వద్ద ట్రేడవుతోంది.

ఒక రకంగా చెప్పాలంటే ఈ సెన్సెక్స్ మరియు నిఫ్టీ మన దేశ ఆర్థిక పరిస్థితి ను మరియు స్టాక్ మార్కెట్ అభివృద్ధిని సూచిస్తుంది.

 

CLICK LINK BELOW TO WATCH THIS VIDEO IN YOUTUBE

 

CLICK HERE

About The Author

1 thought on “స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?సెన్సెక్స్ మరియు నిఫ్టీ అంటే ఏమిటి ?What is Stock Market and What is sensex and Nifty?”

  1. Pingback: What is SGX Nifty ? SGX నిఫ్టీ అంటే ఏంటి?SGX Nifty Explained - Welcome

Comments are closed.

Scroll to Top